కలియుగ దైవంగా కీర్తించబడుతున్న తిరుపతి వెంకన్న గురించి:-

కలియుగ దైవంగా కీర్తించబడుతున్న తిరుపతి వెంకన్న గురించి:-

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!

తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడని భక్తుల విశ్వాసం.

తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని పురాణ కథ. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

మొదటగా క్రీ.శ.614లో పల్లవ రాణి సామవై పేరిందేవి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది.

భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా బహుకరించి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయంలో మొట్టమొదటి కానుకగా దేవాలయంలోని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది.

తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధమాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు 1470లో నాలుగు మూలలా నాలుగు స్థంభాల మండపాలను నిర్మించాడు.
అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు.

ముఖ్యంగా రాయలకాలం తిరుమలకు స్వర్ణయుగం.
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు.

ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10 న 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు రెండు బంగారు గిన్నెలు ఇచ్చారు.

1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడో సారి తిరుమల సందర్శించి,మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు సమర్పించాడు.

నిత్య నైవేద్యానికి ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న నాల్గవసారి తిరుమలని దర్శించి,30 వేల వరహాలతో కనకాభిషేకం చేసాడు. నిత్యారాధన కోసం తాళ్ళపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.

1517 జనవరి 2న ఐదవ సారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్టించుకున్నాడు. 1518 సెప్టంబర్ 9న ఆనందనిలయానికి బంగారు పూత చేయించాడు.

1518 లో ఆరవసారి, 1521 ఫిబ్రవరి 17న ఏడవసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు.

విజయనగర సామ్రాజ్య పతనానంతరం కర్నాటక నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు ఆలయంపై పన్నులు విధించాడు.

ఈ విషయంలో మరాఠాలతో వివాదం ఏర్పడింది. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు.

తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచీ తిరుమల పరిపాలనను స్థానిక కలెక్టరు చేసేవారు.

ఆలయ ఆదాయవ్యయాలను స్థిరపరిచి వాటి నుంచి స్వామికి సేవలు, ఉత్సవాలు నిర్వహించడం, మిగిలిన సొమ్ము (సంవత్సరానికి రూ.లక్ష) కంపెనీ ఖజానాలో జమకట్టేవారు.

1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున ఆలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు.

90 ఏళ్ళ పాటు మహంతుల నిర్వహణ తరువాత,1933లో అప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు.

19 వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, విశాలమైన హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అతికొద్దిగా ఇళ్ళు ఉండేవి.

కోతుల బెడద విపరీతంగా ఉండేది. అడవి పందులు కొండపై మనుష్యుల నడుమ నడుస్తూనే వుండేవి. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు.

1870లోనే ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ.26 వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది.

1980 లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.

ఏడు కొండల వరుసలో తల భాగాన వున్నందున తిరుమల కొండకు తలకోన అని పేరు వచ్చింది

వైఖానస ఆగమ సూత్రాలను అనుసరించి శ్రీవారికి పూజలు జరుగుతాయి. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ పూజలకు నాంది.

శుధ్ధి, అర్చన, తోమాలసేవ, కొలువు, సహస్ర నామార్చన, అష్టోత్తర శతనామార్చన, రాత్రి కైంకర్యాలు, ఏకాంతసేవ తరువాత గుడిమూసే ప్రక్రియతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి.

స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు.
డోలోత్సవం, సహస్రదీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు మాత్రం ఉత్సవమూర్తులకు జరుగుతాయి.

ఇక టిటిడి గురించి:
1933లో ఈ పాలకమండలి ఏర్పాటైంది. ప్రపంచములోనే అత్యంత ధనిక హిందూ ఆలయ పాలకమండలి ఇదే.

రూ.1925 కోట్ల వార్షిక బడ్జెట్‌, వేలాది సిబ్బంది, సామాజికసేవ, వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు.

ఎన్నో కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేసి జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఘనత మాత్రం తొలి ఈ.వో. చెలికాని అన్నారావు గారిదే.(బొబ్బిలి రాజవంశస్థుడు)

1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తిరుమల-తిరుపతికి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మాణం,
ఉచిత అన్నదాన పథకం, మిరాశీ వ్యవస్థ రద్దు, కల్యాణకట్టలో ఉచితంగా తలనీలాలు, అధునాతన రోడ్ల నిర్మాణం,
తిరుమలకు తెలుగు గంగ నీటిని తరలించడం, కొండమీద నిరంతర విద్యుత్తు, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్‌ నిర్మాణం ఇవన్నీ ఆయన హయాంలోనే జరిగాయి.

తిరుమల వెంకన్నకు దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి.
ముఖ్యంగా స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను మన జిల్లాకే చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం.

ఇలా ఎన్నో విశేషాలుగల వెంకన్న గురించి
సశేషంగా చెప్పుకుంటూ పోవచ్చు……VenuGopa

🌞తిరుమల లడ్డూ చరిత్ర

🍪తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించినది.

🍪భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు.

🍪ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.

🌷ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది. పది హేనేళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు.ఇపుడు ఆ సదుపాయం లేదు.🌷

🍪అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది.
నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర.

🍪ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.

🍪క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవ౦ ప్రవేశపెట్టి౦చాడని ప్ర్రతీతి. ఆధునిక కాల౦లో స్వామికి నిత్యకల్యాణ౦ చేస్తున్నారు.

🍪పెళ్ళిళ్ళలో బూ౦దీ లడ్డు తెలుగి౦టి స౦స్కృతి కాబట్టి, నిత్యకళ్యాణ౦ సమయ౦లో కళ్యాణ౦ చేయి౦చిన వారికి బూ౦దీలడ్డు ఉచిత౦గా ఇవ్వట౦ ఆచార౦ అయ్యి౦ది.

🍪ఆ స్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు.

🍪దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.

🍪కళ్యాణోత్సవ లడ్డూ –
కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు భక్తులకూ
1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది.
దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.
లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.
ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.
ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.

🍪శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. –
ఆవు నెయ్యి – 165 కిలోలు
శెనగపిండి – 180 కిలోలు
చక్కెర – 400 కిలోలు
యాలుకలు – 4 కిలోలు
ఎండు ద్రాక్ష – 16 కిలోలు
కలకండ – 8 కిలోలు
ముంతమామిడి పప్పు -30 కిలోలు

🍪ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.
తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల కలదు. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ లక్షల లడ్లు తయారీ జరుగుతునంది…….Dr.Malli

About Common Man

Common Man! 95% Indian’s soul. I am a Kundalini Yogi & enlightened person. I cannot do any thing except expressing my opinion to remaining Common People. My spirit does not permit me to harm any being, but if any body do harm to Common people; I do air it to the Society to prevent it. I like Muslims who do the prayer of Almighty every day 5 times. However, I hate terrorism on the mask of Jihad. I like Universal love pronounced by Christ, but I hate the policy to denounce the other religious methods. I learned well from the Ramayana and Mahabharata through my mother at the time of my childhood. Lord Rama is in my heart like all Hindus, I am a follower of all political parties, even though I don't support decisions taken by parties against Common People, I hate hereditary politics and chanting leaders I do support the good ideas and proposals from all parties. By birth, I hate corruption. By birth, all people have a right on Natural resources, which are gifts of Almighty, after deaths nothing shall come with you. only a land of 6feet x 3feet at burial ground or 500Kg fire wood can mix all individuals into the Earth or Air, every body know the above universal truth, But I don't understand why Corrupt people are doing so many Frauds to earn lots of money with corrupt practices and directly doing harm to the society and Common People. Government job or people's representative ship is not a license to earn money by corrupt practices, they are taking salaries, and other benefits from people's common fund collected as taxes form all people. Therefore, Prime Minister to attender who is taking salaries and remunerations from common fund is responsible & accountable to people of this country. By chance, you get an opportunity to serve the country, utilize the great opportunity as Almighty gift to earn great fame, which is long living. Do not try to bandit public money by corrupt practices, Almighty shell punish you and your family because you are violating the rules of almighty. I am a harmless citizen who has the right to demonstrate in collective assembly.
This entry was posted in Reformer. Bookmark the permalink.